Tuesday, November 26, 2013

సీమవాసుల తలుపు తట్టిన అదృష్టం!- వత్సల విద్యాసాగర్

నిజ్జంగా ఇది నిజం సుమా. జరిగింది మంచి కాదు, గానీ మంచికే జరిగింది. సహజసిద్ధం గానే ఒక దగ్గర కిటికీ మూసుకుపోతే నీకోసం మరెక్కడో తలుపులే తెరిచి ఉంటా యంటారు. ఇలాగే అనాలోచితంగా ఇంకో రెండు తరాలనో, నాలుగు తరా లనో తగలబెట్టాక ఇప్పటి స్థితి ఎదురైఉంటే! ఏమయ్యే ది?ఎంత కాదనుకొన్నా ఎన్ని విధాల సరిపెట్టు కుందామన్నా జరిగిన నష్టం వెలకట్ట గలిగేది కాదు, కొలవగలిగేదీ కాదు. కాకుంటే ఈ అనుభవం- ‘ఆగి, ఆలోచించ’మనే సత్యాన్ని ఉద్బోధిస్తుంది. ‘చీమా చీమా ఎందుక్కుట్టావ్‌?’ అంటే ‘నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా?’ అందట. అట్లాంటిది. రోషం, పౌరుషం ఎక్కువ సీమవాసులకు- అందరూ చెప్పేమాటే! కాదు కాదు ఉన్నమాటే! స్వతంత్రంగా బ్రతకాలనే ఆలోచనే రోషం. స్వతంత్రంగా బ్రతకడమే పౌరుషం. సీమవాసులకు ఇవి రెండూ పుష్కలంగా ఉండటం వల్లనే సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన ‘పాలెగాళ్ళ’ చరిత్రకు చిరునామా కాగలిగారు. అలాంటి సీమవాసులు ఇంత జరుగుతున్నా నిస్తేజంగా నిర్వీర్యంగా ఎందుకు ఉంటున్నారనేది వేయి ముళ్ళ చిక్కుప్రశ్న.వంగేవాడికి ‘వంగి సలాం’ చేసే సంస్కృతిలో బతికే వారొకరు, ‘బాంచెన్‌ దొర నీ కాల్మొక్త’ అనేవాళ్ళు ఇంకొకరు- ఇద్దరూ కలిసి సీమ అస్తిత్వాన్నే ప్రశ్నార్థకం చేసిన నేటి పరిస్థితి?

ఈ 60 సంవత్సరాలలో రాష్టప్రతి నుండి ముఖ్యమంత్రిదాకా దాదాపు 50 సంవత్సరాలు- శక్తిమంతమైన నాయకులను అందించిన సీమను మాత్రం- అటు ఆంధ్రవాసుల, ఇటు తెలంగాణీయుల చేతులలోనేకాక, వారి వారి స్వలాభం, కుటుంబలాభం, కులలాభం, వర్గలాభాలను మాత్రమే దృష్టిలోఉంచుకొని పాలన సాగించే దుర్మార్గపు సొంతఇంటి నాయకుల చేతిలో నల్లమందు కలిపిన పాలుత్రాగి మెదడు సచ్చుబడినదానిలా ఆలోచనారహిత స్థితిలోకి నెట్టారేమో! అనిపిస్తూ ఉంటుంది.లేకపోతే 60 ఏండ్ల బతుకు తగలబడిపోతే సీమవాసులు ‘సమైక్యవాదం’లో పడి కొట్టుకు పోతుండటమేమిటి? ‘అణచివేత’కు పదహారణాల ఉదాహరణఅయిన తెలంగాణీయులు ఉద్యమం చేయడం అర్థరహితం కాకపోవచ్చు. దుర్మార్గం, దోపిడీ ఉన్న దగ్గరంతా తిరుగుబాటు రావటం సహజం. సహృదయంతో అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రత్యేక తెలంగాణ సాధన కోసం వాళ్ళు ఎన్నుకొన్న మార్గాలు,ఆచరించిన విధానాలే ఆశ్చర్యపరుస్తాయి.బహుశా అలాంటి తెలివి, ప్రకియలన్నీ ఆంధ్రవాసులనుండి తెలంగాణవాళ్ళు నేర్చుకొన్నా రేమో! అనిపిస్తుంది. ‘నీ సొంత తెలివి లేకుంటే మానె, పక్కోడ్ని చూసయినా నేర్చుకో’ అన్నట్లు -ఈ విషయంలో తెలంగాణవాసులు నాలుగడుగులు ముందేఉన్నారు. కానీ సీమవాసులే వెనుకబడిఉన్నారు. ఇరుగు-పొరుగుల్నిద్దరినీ నిశితంగా గమనించి నేర్చుకోవాల్సింది ఆచరించాల్సిందీ సీమవాసులకు చాలానే ఉంది.

సమాజంలో ఏవైనా రాజకీయ, ఆర్థిక, సామాజిక గందరగోళ పరిస్థితులు నెలకొన్నప్పుడు అయోమయ పరిస్థితుల్లో ప్రజలు ఉన్నప్పుడు మేధావివర్గం- సమస్య, దానిమూలాలు, కారణాలు, విశ్లేషణలతో దిశ- నిర్దేశాలను సూచిస్తుంది. కానీ దౌర్భాగ్యమో దురదృష్టమో తెలియదు, ‘సీమ’ అస్తిత్వం నేపథ్యంలో మేధావివర్గం కించిత్‌ మౌనమే వహిస్తూంది. బహుశా ఆ వర్గం కూడా ప్రభావాలకు లోనై ‘సమైక్య’ భ్రమలోపడి కొట్టుకుపోతుండటం కావచ్చు. సాహితీలోకం- పీడితవర్గం వైపునుండి తమ కలంతో అక్షరాల స్వరాలను కూర్చి ప్రజల్ని ఆలోచింపచేసి, చైతన్యపరిచి,ఉద్యమస్ఫూర్తిని నింపుతూ వాళ్ళపక్షం నిలబడు తుంది. తెలంగాణ విభజన ఉద్యమ నేపథ్యంలో తెలంగాణకు మద్దతు తెలుపుతూ కవిత్వం, కథలు, వ్యాసాలు వ్రాయటం ద్వారానేకాక సభలు, ఊరేగింపులు, ఉపన్యాసాలద్వారా ప్రత్యక్షంగా వాళ్ళతో స్వరం కలిపి ప్రముఖపాత్ర పోషించిన తెలంగాణేతర సాహితీవేత్తలు సీమపట్ల ఎందుకు బాధ్యతా రాహిత్యంగా ఉన్నట్లు? మూగపోయిన స్వరాలతో గొంతు పెగలని స్థితిలో ఎందుకు ఉన్నట్లో!

కొంత చిన్నబుచ్చుకొనే అంశమైనా ఎంతోకొంత ఆలోచించాల్సిన, గమనించా ల్సిన అంశం - కొంతమంది సీమేతరులు- తెలంగాణీయులే సీమపట్ల ఛిౌఛ్ఛిటతో ఉండటం ఆనందించాల్సిన విషయం. వీటన్నింటికీ బలాన్ని చేకూ రుస్తూ ప్రచారంలో తీసుకువచ్చే పని చేయాల్సిన మీడియా ఒక రాష్ట్రం-నాలుగు ప్రాంతాల సమస్యలతో ముడిపడి ఉంటే తెలంగాణ ప్రాంతంవైపు మాత్రమే పనిగట్టుకొని ప్రచారం చెయ్యడం- వెనుక లోగుట్టు పెరుమాళ్ళకెరుక!
తెలంగాణవాదంలో గమనించాల్సిన వాటిలో కొన్ని ప్రధానమైనవాటి గురించి మాట్లాడు కుంటే, స్వయంపాలన కానిదేదయినా పీడనతో కలిసిపోయి ఉంటుందనేది వాస్తవం. నిజానికి తెలంగాణ అరాచకాలకు, అణచివేతలకు గురయింది- విలీనానికి ముందు అనేది గమనిం చాల్సిన విషయం. విలీనం తర్వాత ఈ 60 సంవత్సరాలు ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఉన్నారు. మరి ఈ 60 సంవత్సరాల ప్రజాస్వామ్య పాలనని కూడా కలుపుకుంటూ తెలంగాణ ఉద్యమం వందేళ్ళనుండి చేస్తున్నట్లు లెక్కలుచెప్పటం ఏమిటి? లేక- ఈ 60 ఏళ్ళ ప్రజాస్వామ్య పాలనలో తెలంగాణ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించినవాళ్ళు తెలంగాణ నాయకులుకారా? తెలంగాణ నాయకులే అయిన జలగం వెంగళరావు, చెన్నారెడ్డి, అంజయ్య తెలంగాణకు ఏమీ చెయ్యలేదా? చెయ్యనట్లయితే మరి వాళ్ళనాయకులే ఏమీ చెయ్యకపోతే ఇతరుల మీద నిష్టూరం ఎందుకు? పోనీ తెలంగాణకు చెయ్యనివి ఏవైనా సీమాంధ్రలకు చేసిఉంటే ఈ రోజు అవి ఎందుకు చూపెట్ట లేకపోతున్నట్లు? లేక సీమ నాయకులు సీమకు మాత్రమే చాలా చాలా చేసిఉంటే అవన్నీ ఎక్కడికెగిరిపోయినట్లు?
విపరీతమైన పబ్లిసిటీని, సానుభూతిని సంపాదించగలిగిన అంశం -తమకు రావలసిన కొన్ని వేల ఉద్యోగాలని తమకు రాకుండా చేశారని. అందులో ఎంత వాస్తవముంది? అనేది - ప్రభుత్వం ఎన్నెన్నిట్ఛఛిటఠజ్టీఝ్ఛ్టట ని ఏ విధంగా ఎప్పుడెప్పుడు ఏఏ ఎై ల ప్రకారం భర్తీచేస్తూ వచ్చింది ఊ్కఎైల సంఘం పూర్తి వివరణ ఇచ్చింది. ఒకవేళ ఆ వివరణలో నిజం లేదనుకొన్నా, లేకున్నా- 60 సంవత్సరాల కాలం ఒక ప్రాంతపు అభివృద్ధి = ఇంకో ప్రాంతపు వేల ఉద్యోగాల(సమానమ)వుతాయా? -అందులో సీమవాసులు పొందిన వాటా ఎంత? ఖీూఎై’ట, ఊ్కఎై’ట రెండింటినీ అడిగి చూడాలి.

గొప్ప సెంటిమెంటు విషయమే మరొకటి చూద్దాం- ప్రాణత్యాగాలకు ప్రతిరూపం తెలంగాణ ఉద్యమం- అని, ‘మన పట్నం వాళ్ళది ఎట్లైతది?’లాంటి ప్రచారాలు- ‘తాజ్‌మహల్‌కు రాళ్ళెత్తిన కూలీలెవ్వర’న్నట్లుగా సమాజంలో ఏ గుర్తింపూ లేనిది శారీరక శ్రమ. ఇందుకు ఎవరూ అతీతం కాదు. మనుషులు ప్రాణాలను పోగొట్టుకోవడం- వాళ్ళు ఎక్కడివాళ్ళయినా ఎవరయినా అది విషాదం. విషాదం కొలమానంగా ఆలోచించడం ఏ విధంగానూ భావ్యం కాదు. 1956 తర్వాత విస్తరించిన నగరంలో తెలంగాణేతరులు ప్రాణాలు కోల్పోలేదా? విలీనం తరువాత పీడనని వ్యతిరేకించే దిశలో వచ్చిన ఉద్యమాలు ఏవయినా అన్ని ప్రాంతాలవారి భాగస్వామ్యంతోనే జరిగాయి. ప్రజాస్వామ్యం ముసుగులో జరిగిన అన్ని రకాల దాష్ఠీకాలను ప్రశ్నించి, నిలదీస్తూ ఎదురుతిరిగి ముందుకు సాగిన నక్సలైటు ఉద్యమం మొదలు బషీర్‌బాగ్‌ కరెంటు ఉద్యమం వరకు పోరాటం చేసినవాళ్ళు కానీ ప్రాణాలు కోల్పోయినవారు గానీ తెలంగాణేతరులు లేరా? ఉంటే వారి త్యాగాలు వారివారి ప్రాంతాలనుద్దేశించి మాత్రమే చేసినవా? లేకపోతే అలాంటి వాళ్ళ ప్రాణత్యాగాలకు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదా? వినాయక చవితి వస్తూందంటే చాలు పాతబస్తీవాసులు పునరావాస కేంద్రాలకు వచ్చినట్లు మూటాముల్లె సర్దుకొని పాతబస్తీ బయట ఆ కొద్దిరోజులు తలదాచుకున్న చరిత్ర ఎట్లాఅప్పుడే మరుగ యింది? పాతబస్తీ వాసులలో 99% తెలంగాణవాసులే ఉంటారు. అట్లా వచ్చిన వాళ్ళకు ఆశ్రయమిచ్చినవాళ్ళలో తెలంగా ణేతరులు లేరా?

అటు అల్లూరి నుండి, ఇటు తరిమెల నాగిరెడ్డి పోరాటం వరకూ ఎవరినుద్దేసించి చేసినవి? వాటి ఫలాలు ఎవరు అనుభవించారు? ఎవరికి చెందాయనుకొందాం? మనందరికీ చెందాయని చెప్పడానికి క్షణమాత్రం కూడా సంశయించక్కరలేదు. చరిత్ర ఎప్పుడూ పునాదేకానీ భవంతి కాలేదు. ‘మినార్‌’లలోనో, కోట బురుజు ల్లోనో, కందకం లోతుల్లోనో వెలసిపోయిన చరిత్రని అణగారిన గతాన్ని పోల్చుకొంటూ పోతే నీకొకటి ఉంటే నాకు రెండు అనొచ్చు. ఆ మాటకొస్తే రాజరికవ్యవస్థే ప్రజాపాలనకు వ్యతిరేకం. రాజ్యాలు పోయిరి, రాజులు పోయిరి, కానీ ‘రాజకీయ’మట్లనే ఉండిపోయింది. అది ఉన్నన్నాళ్ళు రాజ్యకాంక్ష ఉండనే ఉంటుంది. రాజ్యకాంక్ష లేని రాజకీయమూ లేదు, రాజకీయ నాయకుడూ లేడు.అభివృద్ధి అంటే సంక్షేమ పథకాల లబ్ధిదారులు పెరగటమూ కాదు, ముఖ్యమంత్రి అభ్యర్ధిత్వపు నియోజకవర్గంలో తారురోడ్లు తళతళలాడడమూ కాదు. మూడుపూటలా ఐదువేళ్ళూ నోటికందక అలమటించేవారి సంఖ్య అంతరించిపోవటం! మరో అంశం ‘భాష’. అడుగడుగునా, అవమానాల పర్వం మాది అంటున్న తెలంగాణ భాష కమెడియన్లకు వాడుతున్నారు అన్నది వాస్తవం. కానీ కథలో ప్రధాన పాత్రలు ఏ్ఛటౌ, గి జీజూజూౌ. అలాంటి ‘ప్రధానపాత్ర’ల్లో ఒకటైన విలన్‌ పాత్రనే ‘సీమ’కు క్టబెట్టి, సీమది బాంబుల సంస్కృతి గా చిత్రీకరిస్తే మరి సీమవాసులకెంత కోపం, పౌరుషం రావాలి! అదొక గొప్పదనంగా భావించి, ప్రత్యేకతగా తీసుకుందామా?

తెలంగాణవాదులది చిన్న రాష్ట్రాల ప్రతిపాదనే అయితే, రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర ప్రతి పాదనను ఎందుకు విభేదిస్తున్నట్లు? ఒకవైపు ఎక్కడో ఉన్న విదర్భ ప్రతిపాదనను టఠఞఞౌట్ట చేస్తూ, ఇక్కడ సీమ గురించి మాట్లాడితే నచ్చకపోవటం ఎందుకు? అంత కోల్పోయినా సీమవాసులు స్పష్టంగా ఉంటే సమైక్యం- లేకుంటే మూడు రాష్ట్రాలు కావాలంటే ఏ ఒక్కరికీ మింగుడుపడని పరిస్థితి ఎందుకుంది? ఒక్క తెలంగాణవాదులే కాక అటు చిన్న రాష్ట్రాల ప్రతిపాదనే అజెండాగా సాగే బిజెపి కానీ, కాంగ్రెస్‌ కానీ యుపి ని నాలుగు రాష్ట్రాలు చేస్తామంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లు? రెండు పార్టీలూ ఒక్క తెలంగాణ విభజనని మాత్రమే టఠఞఞౌట్ట చేస్తూ పక్కనే ఉన్న సీమ మాటే ఎత్తకపోవడం ఎందుకు? ‘సెంటిమెంట్‌’తో కాదు. ‘సైంటిఫిక్‌’ అంటారు. పైవన్నీ ఏమిటి? సైంటిఫిక్‌ అప్రోచ్‌తో చేస్తున్నవేనా? ఎవర్నడుగుదాం?
ఏది ఏమయినా ‘నాలుగు జిల్లాలే కదా? మీకు నీళ్ళెట్లా? మీకేం వనరులున్నాయి? పది ఎంపీ సీట్లే కదా? ఎట్లా బతుకుతారు?’ అంటూ రకరకాలుగా ప్రశ్నించే వాళ్ళకందరికీ ఒకటే సమాధానంగా- ‘మేం ఎట్లా బతుకుతామో చెప్పి ఒప్పిస్తే తప్ప- మేం విడిగా బ్రతికేందుకు మీరు ఒప్పుకోరా?’ అని అడగచ్చు- కానీ ఇవన్నీ నిజాలే కదా? ‘ఎట్లా బతగ్గలం’ అంటూ దిగులుపడే సీమవాసులదే సగం సమస్య - ఇప్పుడు నిజంగా సీమవాసులకు కావలసింది - ఖనిజసంపదో... కూచుని తింటే కొండలయినా కరిగిపోతాయంటారు- నీటివనరులో ఇప్పటివరకూ తెలంగాణ నీళ్ళిస్తే బతికామా? ఆంధ్రవాళ్ళిచ్చే నీళ్ళతో బతుకుతున్నామా?

ఎత్తిపోతలలో కానీ, మిగులుజలాల్లో కానీ మన నీళ్ళ వాటా దోచుకోలేదా? రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం పెరగడమో... పక్కనే ఉన్న కేరళ రాష్ట్రం మొత్తం కలిపినా మన రెండు జిల్లాల విస్తీర్ణం కంటే తక్కువే. ప్రత్యేక ప్యాకేజీలో... మొత్తం కాంట్రాక్టుల రూపంలో మళ్ళీ నాయకుల జేబుల్లోకే వెళ్తాయి - ఎంపీ సీట్ల సంఖ్య పెరగడమో... ఒకే ఒక్క ఎంపీ సీటు రాష్ట్రంగా కలిగిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. విశాలమైన నగరాలు లేకపోవడమో... ఒక నగరమే ఒక రాష్ట్రంగా ఉన్నవి కూడా ఉన్నాయి. ఇలా చెప్పుకొంటూ పోతే ప్రతిదానికీ ఒక పరిష్కారం దొరుకుతుంది. కానీ అన్నింటికంటే ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన వరం ’అజ్ట్ఛూట్చ్ట్ఛ. ‘నాకంటూ అవకాశమొస్తే తిరిగి సీమ ముంగిట రత్నాలు రాసులు పోయిస్తా’ అనే భావాలు కలిగిన యువతరం ఒక్కచోట చేరి ప్రయత్నిస్తే నిజంగా సాధ్యం కానిది కాదు. విడిగా ఒక వెలుగు వెలిగిన సీమ విలీనంలో కూడా తన బతుకు అదే బతికింది. అలాంటి సీమకు ఇప్పుడు కావలసింది తన అస్తిత్వం. ధైర్యలక్ష్మిని ఆపితే మిగిలిన అష్ట లక్ష్ములూ తిరిగి వచ్చినట్లు సీమ తన అస్తిత్వం సాధిస్తే కావలసినవన్నీ వాటంతట అవే వస్తాయి. ఏదీ లేదనుకొన్నప్పుడు - నీకు నువ్వే మిగిలినప్పుడు - గుండె నిండిన ఆత్మ విశ్వాసం అన్నింటినీ మరిపించి, నడిపించే శక్తి అవుతుంది. జరిగిన అన్యాయానికి ప్రకృతి సహకరిస్తే - దానికి సీమవాసుల పట్టుదల, ఆత్మగౌరవాలు తోడయితే, ఆలస్యంగానైనా తమకు అందివచ్చిన అదృష్టంతో తమ అస్తిత్వాన్ని నిలుపుకుంటూ...

‘మద్రాసు నుండి ఆంధ్రరాష్ట్రం విడిపోవడం లాభదాయకమైతే, ఆంధ్ర నుండి రాయలసీమ విడిపోవడం మరింత లాభదాయకం’ అని 1931 నాడే ‘రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం’ కావాలన్న మన పెద్దల ఆకాంక్షల సాకారం బాటగా... ఎగరవేసే బావుటా రెపరెపలు విశ్వాంతరాళంలో ఉనికిని చాటే క్షణాలను ఆహ్వానిస్తూ, ఆ క్షణాలకోసం పరితపిస్తున్న ఎద లోయల్లో ఆలస్యంగానైనా సీమవాసుల తలుపు తట్టబడిన అదృష్టం సాక్షిగా ఏరువాక పొంగేను. 
-సూర్య దినపత్రిక (26-11-2013) సౌజన్యంతో..! 

2 comments:

  1. mi visleshana chaala baagundi.

    ReplyDelete
  2. నేను కోస్తా ఆంధ్ర ప్రాంతానికి చెందినా రాయలసీమతో సంబంధం,సానుభూతి ఉన్నాయి.క్లుప్తంగా వ్రాస్తాను.1.రాయలసీమ 4జిల్లాలు,నెల్లూరు,ఒంగోలు జిల్లాలు కలుపుకొని(ఆ రెండు జిల్లాలవారికి ఇష్టమైతేనే) ప్రత్యేకరాష్ట్రం ఏర్పాటుచేఇప్పుడే చేసుకొనడం మంచిది.తెలంగాణా ,రాయలసీమ ,కోస్తా ఆంధ్ర వేరుగా 3 రాష్ట్రాలు ఏర్పడితే మంచిది.రాజధానులు నిర్మించుకొనేవరకు 10 సం;హైద్రాబదునిఉమ్మడిగా కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంచాలి.రాయలసీమవారు ఐనా,తెలంగాణావారు ఐనా ,మంత్రులూ,ముఖ్యమంత్రులూ సమర్థంగా నిజాయితీగా పాలించి ఒరగబెట్టింది పెద్దగా లేదని మనం గ్రహించాలి.అందువల్ల ఒకప్రాంతంవారు ఇంకొక ప్రాంతంవారిని నిందించడం,ద్వేషించడం తగదు.మనస్ఫూర్తిగా,అభిమానంతో కలసి ఉండలేకపోతే విడిపోడమే మంచిది.

    ReplyDelete

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...