Tuesday, February 26, 2013

బహుముఖ ప్రజ్ఞాశాలి తిరుమల రామచంద్ర

Dr-Thirmala-ramachandra తిరుమల రామచంద్ర తన 84 ఏళ్ళ జీవి తంలో అర్ధ శతాబ్ది- పత్రికా రచనకే అంకి తమైనారు. ప్రసిద్ధ కవిపండితులు, కళా కారులు, భాషావేత్తలు, తత్త్వ చింతకులు అయిన ప్రతిభాశాలురతో వందమందిని పైగానే ఆయన ఇంట ర్వ్యూ చేసి ఉంటారు. సుమారు 50 పుస్తకాల దాకా ఆయనవి అచె్చైనాయి.ఆయన చూసినంత దేశమూ, ఆయనకు లభించినన్ని జీవితానుభవాలు, దేశమం తటా ఆయనకు లభించిన విశిష్ట వ్యక్తుల పరిచయా లూ మరెవరి విషయంలోనూ ప్రస్తావించలేము. ఆయన స్వీయ చరిత్ర ఒక గొప్ప నవలకన్నా ఆసక్తికరంగా చదివిస్తుంది. ఉత్కంఠ భరితంగా సాగుతుంది. వారికి తెలిసినన్ని భాషలు కూడా సమకాలీనులైన సాహితీ వేత్తలకు తెలియవనే చెప్పాలి.

ఆయన లాహోర్‌లో మూడేళ్ళున్నారు. అక్కడ పంజాబీ విశ్వవిద్యాలయం అనుబంధ విద్యాసంస్థ అయిన ప్రాచ్య లిఖిత తాళపత్ర గ్రంథాలయంలో వివరణాత్మక సూచీ కర్త (డిస్క్రిప్టివ్‌ కాటలాగర్‌)గా పని చేశారు. ఆ తర్వాత లక్నోలో కొద్దిగా హిందీ ఉపాధ్యాయత్వం నెరిపారు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో సైన్యంలో హవల్దార్‌ క్లర్క్‌గా పనిచేశారు. సైనిక విన్యాస గౌరవాభినందనలు అందుకోవటానికి వచ్చిన విన్‌స్టన్‌ చర్చిల్‌ను దగ్గరగా చూశారు. ఇరాన్‌ సరిహద్దు అయిన చమన్‌లో సైనిక విధులు నిర్వహించారు.

రాహుల్‌ సాంకృత్యాయన్‌ కాన్పూర్‌లో ఒక సాహితీ సమావేశంలో ప్రసంగించగా- ఆయన ప్రసంగ పాఠాన్ని కాన్పూర్‌ నుంచే అప్పు డే ప్రారంభమైన డెయిలీ టెలిగ్రా్‌ఫ్‌ పత్రికకు విలేఖ త్వం వహించి వృత్తాంత కథనం రూపొందించారు. రాహుల్‌ సాంకృత్యాయన్‌ను స్వయంగా కలుసుకు న్నారు. లక్ష్మ్‌ణ్‌ స్వరూప్‌, కె.పి. జయస్వాల్‌ వంటి గొప్ప సాహితీ వేత్తలను కలుసుకున్నారు. బహు భాషా కోవి=దుడైన రఘువీర తన ప్రపంచ భాషా నిఘంటు నిర్మాణంలో తనతో కలిసి పనిచేయవలసిందిగా- సహాయ సహకారాలు అర్ధించగా- జీవనోపాధికి ఆ పని కలిసిరాదని ఉత్సుకత చూప లేకపోయానని, అటువంటి గొప్ప అవకాశం వదులుకోవలసినదికాదనీ పశ్చాత్తాపం చెందినట్లు స్వీయ చరిత్రలో చెప్పుకున్నారు.

లాహోర్‌ విశ్వవిద్యాలయంలో పనిచేస్తుండగా ప్రసిద్ధకవి మహమ్మద్‌ ఇక్బాల్‌ విశ్వవిద్యాలయంలో సర్వేపల్లి రాధా కృష్ణ వాట్‌ ఈజ్‌ ఫెయిత్‌ (‚అంటే ఏమిటి?) అని రెండు గంటలపాటు శ్రోతలు అంద రూ సమ్మోహితులైనట్లు ప్రసంగించగా, రాధాకృష్ణన్‌ను ఇక్బాల్‌ ప్రశంసించడం మరి చిపోలేని సంఘటనగా స్వీయచరిత్రలో ప్రసక్తం చేశారు. ఆ విశ్వవిద్యాలయ ఓరి యంటల్‌ కాలేజి ప్రిన్సిపల్‌ మహమ్మద్‌ ఖురేషీ అక్కడ సంస్కృత విభాగంలో పని చేస్తున్న మహామహోపాధ్యాయ మాధవ శాస్ర్తి భండారేను ఎంత గౌరవించిందీ వివరించారు.

లాహోర్‌ విశ్వవిద్యాలయ ప్రాచ్య లిఖిత తాళ పత్ర గ్రంథ సంచయంలో తెలుగు లిపిలో ఉన్న గ్రంథాలెన్నో ఉన్నాయని- తంత్ర శాస్త్రం, వేదాంతం, సాహిత్య గ్రంథా లకు తాను వివరణాత్మక సూచిక తయారు చేశానని చెప్పారు. అక్కడ పనిచేస్తు న్నపుడు ఇప్పటి పాకిస్థాన్‌లోని సింధు ప్రాంతాన్ని పర్యటించారు.హరప్పా, మొహంజదారో శిథిలావశేష చారిత్రక ప్రాముఖ్య ప్రాంతాలను దర్శించారు. వీటిని గూర్చి స్వీయ చరిత్రలో వివరించారు. అమృత్‌సర్‌ స్వర్ణ దేవాలయన్ని దర్శించి ము రిసి పోవడమేకాక జలియన్‌వాలాబాగ్‌ దురంతాలు జరిగిన ప్రదేశాన్ని చూసి కన్నీ రు విడిచారు. అక్కడి ఆవరణ ప్రాకార కుడ్యాలకు తుపాకి గుళ్ళు తగిలినప్పుడు ఏర్పడిన రంధ్రాలను తడిమి కళ్ళు మూసు కుని ఉద్వేగభరిత చిత్తంతో మృతవీరుల దేశభక్తిని స్మరించి నివాళించారు.

దేశ విభజన జరిగి లాహోర్‌ పాకిస్థాన్‌కు దక్కినప్పుడు, ఒక గూఢ ప్రణాళికా బద్ధంగా దానిని పాకిస్థాన్‌లో సంలీనం చేసినందుకు పైతృకమైన ఆస్తి అన్యాక్రాంతం దురాక్రాం తమైనంత దుఃఖం అనుభవించానని చెప్పుకున్నారు. లాహోర్‌లో దక్షిణాది కుటుం బాలు ఒకప్పుడు గణనీయంగా ఉండేవని, అక్కడ పాఠశాలల్లో భారతీయ భాషల పఠన పాఠనాలు ఉండేవని ప్రస్తావించి ఎంతో ఖేదం చెందారు. ఇదీ రామ చంద్రగారి విశిష్ట వ్యక్తిత్వం.ఆరోజుల్లో పత్రికా రంగంలో పనిచేయడం గొప్ప దేశభక్తికి తార్కాణంగా ఉండేదనీ, తాను పత్రికా రంగాన్నే తన జీవిత ధ్యేయంగావించుకున్నానీ, అందువల్లనే కాన్పూర్‌లో స్వాతంత్య్రోద్యమ ప్రచార సాధనంగా కొత్తగా స్థాపితమైన దినపత్రికలో చేరానని, అనంతపురంలోని తన తండ్రిగారికి రాయగా, అట్లా అయితే తెలుగు పత్రికలో పనిచేయవచ్చు కదా అని తండ్రిగారు ఉద్బోధించారనీ, ఆ ప్రోత్సాహంతో తెలుగు నాడుకు తరలివచ్చాననీ ఆయన స్వీయ చరిత్రోదంతం.

డెభె్భై ఏళ్ళ కిందనే �తెలంగాణ� అనే పత్రిక వెలువడిందని, దాని కార్యస్థానం హైదరాబాద్‌ అనీ, అది కొన్ని నెలలకే ఆగిపోయిందనీ- ఈ సంస్మరణ వ్యాసరచయితకు రామచంద్ర ఒక ఇంటర్వూలో చెప్పారు.ఇది ఆయనస్వీయ చరిత్రలో ప్రసక్తం కాలేదు.ఇప్పుడు ఈ స్మరణ నివాళి ముఖ్యోద్దేశం ఏమంటే, తెలుగువారి అతి ప్రముఖ దినపత్రికలలో ఆయన పనిచేసినపుడు కొన్ని పదుల ఇంటర్వ్యూలు ఆయన నిర్వహించినా, అన్ని రంగాల ప్రముఖులను కలిసి వాళ్ళ అభిప్రాయాలు అక్షరీ కరించినా ఆయనతో మొట్టమొదటి ఇంటర్వ్యూ, చిట్టచివరి ఇంటర్వ్యూ చేయడం ఈ వ్యాస రచయితకే దక్కిందని ఇతడి అభిప్రాయం. ఆయన స్వీయ చరిత్ర రాయడం ఇంకా పన్నెండు సంవత్సరాలకు మొదలు పెడతారనగా 1984లో ఈ వ్యాసరచయిత ఎంతో విపులంగా ఆయన జీవిత వృత్తాంతం సేకరించాడు. తాను అభిలషిస్తున్న స్వీయ చరిత్ర పేరు �కమలాపురం నుంచి క్వెట్టాదాకా� లేదా �హంపీ నుంచి హరప్పా దాకా� అని ఉం టే- ఏది ఎక్కువ బాగుంటుందని ఆయన ప్రసక్తం చేయ గా- రెండోపేరు ఆకర్షకంగా ఉంటుందని చెప్పడం జరిగింది.

1997లో ఆయన ఇంకో నెల రోజుల్లో కీర్తిశేషులవుతారనగా, ఆయనతో ఇంకొక విపులమైన ఇంటర్వ్యూ ఈ వ్యాస రచయితే నిర్వహించడం జరి గింది. ఆ సందర్భం ఏమంటే- అప్పుడు భారత స్వాతంత్య్రోత్సవ స్వర్ణోత్సవం తటస్థించింది. రామచం ద్రగారి జైలు జీవితం, ఆనాటి స్వాతంత్య్రోద్యమ విశే షాలు, తనను ప్రభావితం చేసిన పెద్దలు, తన ఆదర్శాలు, ఆశయాలు, తన భవిష్యదర్శనం, తానింకా చేయదలుచు కున్న రచనలు మొదలైన వివరాలు తెలుసుకోవాలన్న ఉత్సుకత కలిగింది. ఆయన �మూడు వా ఞ్మయ శిఖరాలు� అనే గొప్ప- సాహి తీ వేత్తల- జీవిత చరిత్రలు కూర్చారు.

మీ జీవితంలో మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసిన సాహితీవేత్తలు, మీరు ఆదర్శీకరించుకున్న సాహి త్య వ్యక్తిత్వాలు ఎవరివి? అని అడగగా ఆయన �మానవల్లి రామకృష్ణ కవి, సురవ రం ప్రతాప రెడ్డి� అని చెప్పారు. అడవి బాపిరాజు విశిష్ట వ్యక్తిత్వం తనను తీర్చి దిద్దింది అని కూడా ఆయన స్మరించుకున్నారు. పద పాఠ నిర్ణయంలో, పరిశోధనలో వేటూరి ప్రభాకర శాస్ర్తి తనకు ఒరవడి దిద్దారని గుర్తు చేసుకున్నారు.
తిరుమల రామచంద్ర తెలుగు వారికిచ్చిన రచనలు చాలా విలువైనవి. ఇంకొక ఏడాదిలో ఆయన శతజయంతి వత్సరంకూడా రాబోతున్నది.
ఆయన గ్రంథాలు �మన లిపి- పుట్టుపూర్వోత్తరాలు, సాహితీ సుగతుని స్వగతం, గాథాసప్తశతిలో తెలుగు పదాలు, హిందువుల పండుగలు, మరపురాని మనీషి, తెలుగు వెలుగులు, హంపీ నుంచి హరప్పాదాకా�ఆయనను ఎప్పటికీ గుర్తుచేస్తూనే ఉంటాయి.వారిది గొప్ప విద్వక్కుటుంబం. తండ్రిగారికి బంగారం చేయడం పట్ల భ్రాంతి ఉండే దని, అందుకుగాను నూరు తులాల బంగారం వారు ప్రయోగ వ్యగ్రతలో వినియో గించారనీ, ఆయన కాలి నడకన బదరీ క్షేత్రాన్ని రెండు సార్లు దర్శించారనీ, జగదేక మల్లుడు కోడి రామమూర్తితో తమ తండ్రి గారికి స్నేహం ఉండేదనీ, 1922లో గాంధీజీ బళ్ళారి వచ్చినపుడు తాను ఎనిమిదేళ్ళ పిల్లవాడిగా దర్శించాననీ, తమది స్వాతంత్య్రోద్యమ నిమగ్న కుటుంబమనీ, తన తాత తండ్రులు బల్గాం కాంగ్రెస్‌కు హాజరైనారనీ- ఇటువంటి ఎన్నో విశేషాలు, ఉత్సుకతా పాదక మైనవని ఈ వ్యాస రచ యిత ఆయనతో చేసిన రెండు ఇంటర్య్వూల్లో- ఆయన చెప్పారు. ఈ రచయిత వాటి ఆధారంగా ఆయన గూర్చి రెండు జీవిత చరిత్రలు, ఇరవై దాకా వ్యాసాలు ప్రచురిం చడం తన సాహిత్యాభిరుచి సార్థకతగా భావిస్తున్నాడు. ఆయనతో తానే మొదటిదీ, చివరిదీ అయిన ఇంటర్వ్యూ చేసినట్లు గుర్తు చేసుకుంటున్నాడు.akkiraju
October 24, 2010 Surya daily

No comments:

Post a Comment

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...