Saturday, April 6, 2013

త్వరలో కొత్త పార్టీ- బైరెడ్డి రాజశేఖర రెడ్డి March 28th, 2013

రాయలసీమ పరిరక్షణ సమితి అధినేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి త్వరలో కొత్త పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. బైరెడ్డి
ఆధ్వర్యంలో హైదరాబాద్ అమీర్ పేటలోని ఓ హోటల్ లో రాయలసీమ పరిరక్షణ సమితి ఈరోజు (గురువారం) భేటీ అయింది. ఈ సమావేశంలో “రాయలసీమ పరిరక్షణ సమితి” కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం బైరెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ హక్కులు కాపాడడం కోసం త్వరలో కొత్తపార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. రాయలసీమ హక్కుల కోసం ఏప్రిల్ 13 నుంచి ట్రాక్టర్ యాత్రను పారంభిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. కర్నూలు నుండి ట్రాక్టర్ యాత్ర ప్రారంభం కానున్నట్లు ఆయన తెలిపారు. ఈ యాత్ర ద్వారా సీమ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తామని, సీమ పరిరక్షణ కోసం రాయలసీమ ప్రజలు రాజకీయంగా ఎదగాలని బైరెడ్డి పిలుపునిచ్చారు. కాగా, ప్రత్యేక తెలంగాణ రాష్ర్టంతో.. ఉద్యమిస్తున్న టీఆర్ ఎస్ కు 2014 ఎన్నికల్లో 90 మంది శాసన సభ్యులు అసెంబ్లీలో అడుగుపెడితే తమకు సిగరేట్ వాతలు, బ్లేడు కోతలే మిగులుతాయని బైరెడ్డి ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల తర్వాత కాబోయే ముఖ్యమంత్రిని శాసించే స్థితిలో ఉండాలంటే సీమ కోసం ప్రత్యేక పార్టీ కావాల్సిందేనని బైరెడ్డి స్పష్టం చేశారు.

No comments:

Post a Comment

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...